తెరాస అధ్యక్ష పదవికి కేసీఆర్‌ రాజీనామా (Eenadu, 3-6-08)

హైదరాబాద్‌, జూన్‌ 3 : ఉప ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేని తెరాస అధ్యక్షుడు కేసీఆర్‌ రాజీనామా చేస్తున్నట్లు ఫలితాలు వెలువడిన రోజే కలకలం రేగింది. అయితే ఆరోజు నేతలు వారించటం, అలాంటి పరిణామం ఏదీ జరగకపోవటంతో అదేం లేదనే భావించారు. అయితే ఈరోజు తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్ష పదవికి కేసీఆర్‌ రాజీనామా చేశారు.

ఉప ఎన్నికల్లో పరాజయానికిబాధ్యత వహిస్తూ తాను అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నానని పేర్కొంటూ ఆయన తన రాజీనామా లేఖను పార్టీ ప్రధాన కార్యదర్శి మధుసూదనాచారికి అందజేశారు. దీన్ని ఆమోదించాలని కార్యవర్గానికి విజ్ఞప్తి చేశారు. ఈరోజు మధ్యాహ్నం పార్టీ సమావేశంలోను, మీడియా సమావేశంలోను ఆయన స్వయంగా ప్రకటిస్తారని భావించారు. అయితే మూడురోజులుగా మీడియాకు దూరంగా ఉన్న కేసీఆర్‌ ఈరోజు కూడా రారని పార్టీ సమావేశంలోను, మీడియా సమావేశంలోను మధుసూదనాచారే ఈ విషయాన్ని ప్రకటిస్తారని తెలుస్తోంది.

One Comment

  1. 1
    Vasu Singam Says:

    in my view he did a good thing, TRS must must not countinue as political party and shoud declare its war agnist govt and should bring a movement in the people to fight in a peaceful way for a year ot two for the indipendence of TELANGANA. if not fight like we fought agnist rajakars………….

    Vasu singam


RSS Feed for this entry

Leave a Comment