కాంగ్రెస్‌లో ఆలేరు చిచ్చు (Andhrajyothy, 3-6-08)

హైదరాబాద్‌, జూన్‌ 3 : కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, రామన్నపేట ఎమ్మెల్యే ఉప్పునూతల పురుషోత్తంరెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించాలని కాంగ్రెస్‌ నాయకుడు లాజరస్‌ డిమాండ్‌ చేశారు. ఆయనకు మద్దతు తెలుపుతున్న ఐటి శాఖ మంత్రి దామోదర్‌రెడ్డి కూడా మద్దతు తెలిపారు. మంగళవారం ఉదయం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ తక్షణమే ఉప్నునూతలను పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్‌ చేస్తున్నట్లు చెప్పారు.

ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన ఎస్‌.లాజరస్‌కు మద్దతు ఇవ్వకుండా ప్రత్యక్షంగా పరోక్షంగా టి ఆర్‌ ఎస్‌కు మద్దతు ఇచ్చారని మంత్రి ఆరోపించారు. సొంత పార్టీ అభ్యర్థికే వెన్నుపోటు పొడిచాడు. రెండు మండలాల్లో అంతా కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నా అక్కడి ఓట్లను టీఆర్‌ఎస్‌కు వేయించేందుకు కృషి చేశాడు” అంటూ దుయ్యబట్టారు. ‘ఉప్పునూతల దొంగ, ఆయనకు సిగ్గులేదు’ అంటూ మద్దతుదారులంతా పెద్దపెట్టున నినదించారు.

ముఖ్మమంత్రి డాక్టర్‌ రాజశేఖర్‌రెడ్డిని లాజరస్‌ ఈ రోజు ఉదయం కలుసుకుని ఉప్పునూతల పురుషోత్తమరెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఓక వినతి పత్రాన్ని అందజేశారు. లాజరస్‌తో పాటు మంత్రి దామోదర్‌ రెడ్డి, కొంతమంది ముఖ్య అనుచరులు కూడా ఉన్నారు.

Leave a Comment