అధ్యక్ష పదవికి కె.సి.ఆర్‌. రాజీనామా (Andhrajyothy, 3-6-08)

హైదరాబాద్‌, జూన్‌ 3 : కె. సి.ఆర్‌. అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.

తమ రాజీనామాను ఆమోదించాలని ఆయన టి.ఆర్‌.ఎస్‌. కార్యవర్గాన్ని కోరినట్టు తెలుస్తున్నది.
ఉపఎన్నికల ఫలితాలతో హవా పెరుగుతుందనుకుంటే, అసలుకే మోసం రావడంతో మనస్తాపం చెందిన కె.సి.ఆర్‌.
ఎట్టి పరిస్థితులలోనూ వెనకడుగు వేసేది లేదని సన్నిహితులకు తేల్చి చెప్పినట్టు తెలుస్తున్నది.

తెలంగాణా రాష్ట్ర సమితి (టి.ఆర్‌.ఎస్‌) ప్రధాన కార్యదర్శి మధుసూదనాచారికి పంపించిన రాజీనామా లేఖలో తాను పార్టీ కార్యకర్తగా పనిచేస్తానని, అందువల్ల పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆయన తన రాజీనామా లేఖలో పేర్కొన్నట్టు తెలుస్తున్నది.

ఎంతో కష్టపడి నిర్మించిన తెలంగాణా ఉద్యమం ప్రస్తుత ఉపఎన్నికలలో దెబ్బ తిన్నంత మాత్రాన పార్టీ అధినేత కె.సి.ఆర్‌. రాజీనామా చేస్తే ఇక భవిష్యత్తు ఏమిటన్నది కీలకమైన ప్రశ్న. ఉపఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఆయన రాజీనామా చేయాలని ఆకాంక్షించిన విషయం తెలిసిందే. అయితే ముగ్గురు కార్యకర్తలు ఆత్మహత్య చేసుకుంటామని ఆందోళనకు దిగడంతో అప్పటికి కె.సి.ఆర్‌. రాజీనామా ఆలోచన వదంతులు అంతటితో ఆగాయి.

ఇప్పుడు ఆయన రాజీనామా సమర్పించినా రాష్ట్ర కార్యవర్గం ఆమోదిస్తుందా అన్నది అనుమానమే. ఒకవేళ ఆయన రాజీనామా లేఖను ఆమోదిస్తే మళ్లీ ఆ స్థానాన్ని భర్తీ చేసే నాయకుడు ఎవరన్నది ప్రశ్న. ఈ పరిస్థితుల్లో కె.సి.ఆర్‌. రాజీనామా లేఖను పార్టీ కార్యవర్గం లాంఛనప్రాయంగా ఆమోదించినా, మళ్లీ కె.సి.ఆర్‌.నే పార్టీ రథసారథిగా ఎన్నుకునే అవకాశం ఉంది.

One Comment

  1. 1
    Pavan Kumar Nerella Says:

    KCR should understand one thing. If you are on the ground you can do what ever you want. Run walk stop.play..sit..etc… if you are in the air you will definietly fall one day. Those who waited patiently waited for the time won finally. KCR was entertaining people rather than fighting for the cause. What so ever happened it the Telangana people who lost. KCR has earned good money so that he can live happily ever after.


RSS Feed for this entry

Leave a Comment