ఆంధ్రజ్యోతి ఎండీపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు (Eenadu,29-5-08)

సంపాదకుడు, విలేఖరిపై కూడా
క్షమాపణ చెప్పేందుకు గడువిచ్చా
అయినా స్పందించనందుకే ఫిర్యాదు
మందకృష్ణ వెల్లడి
మద్దతిచ్చే జర్నలిస్టులపైనా కేసులు పెడతామని హెచ్చరిక

హైదరాబాద్‌ – న్యూస్‌టుడే: ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణ, సంపాదకుడు కె.శ్రీనివాస్‌, ‘బాడుగ నేతలు’ కథనం రాసిన విలేఖరిపై.. ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టం కింద కేసులు నమోదయ్యాయి.

ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చేసిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్‌ పోలీసులు ఈ కేసులు నమోదు చేశారు. ఈ నెల 26న ‘బాడుగ నేతలు’ అనే కథనంలో ‘వూసర వెల్లుల నాయకత్వంలో కుల ఉద్యమాలు… మాటల్లో గాండ్రింపులు.. చేతల్లో బేరసారాలు… ఎన్నికల వేళ అధికారానికి దాసోహం… తైలం తాగుతున్న కుల దీపాలు’ అన్న వ్యాఖ్యలపై; ఈ నెల 27న ‘బాడుగ నేతలు… ఇందులో తప్పేమిటి?’ అనే కథనం పరిధిలో వచ్చిన వ్యంగ్య చిత్రాలపై మందకృష్ణ తన ఫిర్యాదులో అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన వెంట బీసీ సంఘ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య కూడా పోలీసు స్టేషన్‌కు వచ్చారు.

మద్దతిస్తే కేసులు: మందకృష్ణ
పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన అనంతరం మందకృష్ణ విలేఖరులతో మాట్లాడారు. ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి మద్దతుగా మాట్లాడే పాత్రికేయ సంఘాల నేతలతోపాటు తమ దిష్టిబొమ్మలు తగులబెట్టిన జర్నలిస్టులపై కూడా వేధింపుల చట్టం కింద కేసులు పెడతామని హెచ్చరించారు. ఆంధ్రజ్యోతిపై తమ కార్యకర్తల దాడికి కారణాలు తెలుసుకోకుండా రాష్ట్రవ్యాప్తంగా తమ దిష్టిబొమ్మలను చెప్పులతోకొడుతూ దహనం చేసిన విలేఖరులందరిపైనా కేసులు పెడతామన్నారు. జర్నలిస్టు సంఘం నేత అమర్‌తో పాటు మిగతా వారు కూడా శిక్షార్హులన్నారు. తమను అణగదొక్కేందుకు బాడుగ నేతలు కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రచురించిందని ఆరోపించారు. నిస్వార్థ సేవలందిస్తున్న తమను, ఇతర దళిత, బీసీ వర్గాలను కించపరిచేలా ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ వ్యవహరించారన్నారు. వార్త వచ్చిన రోజే 24 గంటల్లో క్షమాపణ చెప్పాలని గడువు పెట్టామన్నారు. దానికి స్పందించనందున కేసు పెట్టామన్నారు. వారిని పోలీసులు వెంటనే అరెస్టు చేయాలన్నారు. ఓ వ్యక్తి పార్టీని పెట్టకముందే అతన్ని సమాజం ముందుకు తెస్తూ.. గోరంతలు కొండంతలుగా రాస్తూ.. దళితులను కించ పరిచేలా రాధాకృష్ణ వ్యవహరిస్తున్నారన్నారు. దాడి చేసింది తమ కార్యకర్తలే అయినా పోలీసులు అరెస్టు చేసిన వారంతా అమాయకులేనని, వారిని వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ ‘బాడుగ నేతలు’గా రాసిన వార్తాకథనం రాష్ట్రంలోని దళితులు, బీసీలపై దాడిచేసేలా ఉందన్నారు. రాజకీయాల్ని ప్రక్షాళన చేయడం పత్రికల బాధ్యతని, అయితే పత్రిక స్వేచ్ఛను దుర్వినియోగం చేసింది ఆంధ్రజ్యోతేనని చెప్పారు. కుల సంఘాల నేతలు ఎవరైనా ప్రభుత్వం, మంత్రుల వద్ద డబ్బు తీసుకుంటే ధైర్యంగా పేర్లు పెట్టి వార్తలు రాసుకోవచ్చునని ఆయన సూచించారు. మందకృష్ణ ఫిర్యాదు మేరకు వేమూరి రాధాకృష్ణ, కె.శ్రీనివాస్‌, వార్త రాసిన విలేఖరిపై ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టంలోని సెక్షన్‌-3, సబ్‌సెక్షన్‌ 10 కింద కేసులు నమోదు చేసినట్లు ఎస్సై కె.రవికుమార్‌ తెలిపారు.

2 Comments

  1. 1
    padma Says:

    manda krishna governament andathow andhrajyothi medha dadi chesindu,e,dadulanu apaka pote elantivi marinni dadulu konasaguthai eppatikaina journalist medhavulu alowchinchandi

  2. 2
    padma Says:

    dongalu,dogalu row,badugula dongalurow
    janalanu munche langanlu row
    journalistla pai dadi chestara
    kalam thow vani kantla podustra
    e patikaina telusu ko manda ,R,krishna

    journalistla power meku telusu


RSS Feed for this entry

Leave a Comment