Archive for May 28th, 2008

బీజేపీ వైపు టీ ఆర్‌ఎస్‌ చూపు(Andhra jyothy,28-5-08)

May 28, 2008

హైదరాబాద్‌, మే 27 (ఆన్‌లైన్‌): కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ విజయం కంటే కాంగ్రెస్‌ ఓటమే తెలంగాణవాదులను సంతోషపరుస్తోంది. ఉప ఎన్నికల్లో తెలంగాణవాదాన్ని గెలిపించడంపై ఇది ప్రభావం చూపుతుందని వారు భావిస్తున్నారు. “కర్ణాటకలో కాంగ్రెస్‌ గెలిస్తే ఇక ఎదురులేదన్న భావన అధిష్ఠానంలో నెలకొనేది. అప్పుడు తెలంగాణ అంశాన్ని తేలికగా తీసుకోవడమే కాకుండా ఏకాభిప్రాయం పేరుతో కాలయాపన చేయడానికి అవకాశముండేది.

చంద్రబాబుకు సిద్ధాంతాల్లేవు (Andhrajyothy, 28-5-08)

May 28, 2008

ఆయనది అధికారం కోసం ఆరాటం
బీజేపీతో చెలిమికి యత్నాలు: వై ఎస్‌
హైదరాబాద్‌, ఆన్‌లైన్‌ మే27: టీడీపీ అ«ధ్యక్షుడు చంద్రబాబు అధికారం కోసం ఆరాట పడుతున్నారని, దానికోసం ఎంతకైనా తెగిస్తారని ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి విమర్శించారు. కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి రాగానే ఆ పార్టీ అగ్రనేత అద్వానీకి బాబు శుభాకాంక్షలు చెప్పారని, ఆ నెపంతో ఆ పార్టీకి దగ్గరయ్యేందుకు ప్రయతిస్తున్నారని ఆరోపించారు. మంగళవారం హైదరాబాద్‌లో రోడ్‌ షో సందర్భంగా వైఎస్‌ విలేఖరులతో మాట్లాడారు. “1999లో వాజ్‌పేయి గ్లామర్‌ను వాడుకునేందుకు బాబు బీజేపీకి [...]

కాంగ్రెస్‌ టీడీపీ సమైక్య వాద భూతాలు(Andhrajyothy, 28-5-08)

May 28, 2008

వాటికి భూతవైద్యం చేయండి
ఉప ఎన్నికలతో ఏ రాజకీయ పార్టీ నిర్ణయమూ జరగదు
అయినాటీ ఆర్‌ ఎస్‌ను గెలిపించండి
లేదంటే తెలంగాణను ఆంధ్రోళ్లు పంటికింద మింగుతరు
కరీంనగర్‌, మే 27 (ఆన్‌లైన్‌ ప్రతినిధి): కాంగ్రెస్‌, టీడీపీలను సమైక్యవాద భూతాలుగా, తెలంగాణ దోపిడీదారులుగా టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అభివర్ణించారు. వాటికి భూతవైద్యం చేసేవిధంగా ఉప ఎన్నికల్లో తీర్పునివ్వాలని తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. ఉప ఎన్నికల ద్వారా ఎటువంటి రాజకీయ నిర్ణయం జరగదని కూడా స్పష్టం చేశారు. అయినా టీఆర్‌ఎస్‌ను బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించాలని [...]

విజిలేసిన తెలంగాణ (Andhrajyothy, 28-5-08)

May 28, 2008

ముగ్గురు నేతలకు జీవన్మ’రణం’
ఆఖరి ఆట మరో 24 గంటల్లో..!
తెలంగాణ పోరు ఆరంభం
ముగిసిన ప్రచార పర్వం
అధికార కాంగ్రెస్‌పై ధరల దాడి
తెలంగాణ పై టీడీపీ అయోమయం
టీ ఆర్‌ ఎస్‌కు సంస్థాగత లోపాలు
తీవ్ర ఒత్తిడిలో ప్రధాన పార్టీలు
(ఆన్‌లైన్‌, హైదరాబాద్‌) ఎర్రటి ఎండల్ని సైతం మరిపిస్తూ వాడివేడిగా… ఏకధాటిగా జరిగిన ప్రచారం మూగబోయి… తెరవెనక తతంగాలకు తెరలేచింది. అసలు సిసలు ‘తెలంగాణ పోరు’కు మరో 24 గంటల్లో తెర లేవనుంది. పోలింగ్‌కు, ఫలితాలకు కొన్ని గంటలే మిగిలి ఉన్న ఈ తరుణంలో [...]

ఉప ఎన్నికలకు భారీ ఏర్పాట్లు (Andhrajyothy, 28-5-08)

May 28, 2008

హైదరాబాద్‌, మే 28 ః ఉప ఎన్నికల నిర్వహణకు జిల్లా ఎన్నికల యంత్రాంగం సమాయత్తమైంది. సు మారు నెల రోజులపాటు కొనసాగిన ఉత్కంఠతకు రేపటితో(గురువారం) తెరపడనుంది. ప్రశాంత వాతావరణంలో పో లింగ్‌ జరిగేందుకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక, సున్నితమైన కేంద్రాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు.

తెలంగాణ మేధావులతో, బహిరంగ చర్చకు సిద్ధమా? (Eenadu, 28-5-08)

May 28, 2008

కేసీఆర్‌కు వైఎస్‌ సవాల్‌
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: నాలుగేళ్లలో తెలంగాణ అభివృద్ధిపై ఆ ప్రాంత మేధావులతోనే బహిరంగచర్చను నిర్వహించేందుకు ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి సంసిద్ధత వ్యక్తం చేశారు. అభివృద్ధిపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న తెరాస.. దీనికి సిద్ధం కావాలని సవాలు చేశారు.

తెలంగాణపై పార్టీకి.. ప్రజలకు (Eenadu,28-5-08)

May 28, 2008

ఉప ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు
కాంగ్రెస్‌, తెరాసలకు బుద్ధిచెబుతారు
సొంత జిల్లాలో కేసీఆర్‌కు షాక్‌
ప్రభుత్వ పనితీరుపై రెఫరెండమే
మా హామీల అమలు సాధ్యమే
 
‘న్యూస్‌టుడే’తో ముఖాముఖిలో చంద్రబాబుఉప ఎన్నికల్లో తెదేపా ఊహించని రీతిలో విజయాలు సాధిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు చెప్పారు. ప్రత్యేక తెలంగాణ విషయంలో ఇటు పార్టీకి, అటు ప్రజలకు నష్టం లేకుండా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. సీనియర్‌ నేతలతో నియమించిన కమిటీ.. పార్టీ భవిష్యత్తును, ప్రజలకు ఒనగూరే ప్రయోజనాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి నివేదిక ఇస్తుందని తెలిపారు.
 

సమైక్య భూతం ఆవరించిన కాంగ్రెస్‌, తెదేపాలకు (Eenadu,28-5-08)

May 28, 2008

ఉప ఎన్నికలలో అన్ని స్థానాలు గెలుచుకుంటాం
ప్రజలు తెలంగాణ గరిమి చూపించాలి
ఏకపక్ష తీర్పు వస్తే కేంద్రం దిగి వస్తది
విలేకరుల సమావేశంలో కేసీఆర్‌ 
కరీంనగర్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: తెలంగాణ శత్రువులకు.. స్పష్టత లేని వాళ్లకు ప్రజలు ఉప ఎన్నికలలో గుణపాఠం చెబుతరు… సమైక్య భూతం ఆవరించిన కాంగ్రెస్‌, తెదేపాలకు వారి భూతం వదిలేలా భూత వైద్యం చేయాలె… వాళ్లకు ఓటమి తప్పదు. తెలంగాణ గరిమి చూపించాలి. శషభిషలు… అనుమానాలు ఉంటే మానుకోండి… ఈ ఎన్నికలలో అన్ని స్థానాలలో తెరాస అభ్యర్థులు విజయం [...]

వైఎస్‌కు ఈసీ తాఖీదు (Eenadu,28-5-08)

May 28, 2008

చంద్రబాబు సమాధానంపై అసంతృప్తి
న్యూఢిల్లీ, హైదరాబాద్‌-న్యూస్‌టుడే: ”ఉప ఎన్నికల ప్రచారంలో మీరు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారు. మీపై ఎందుకు చర్య తీసుకోకూడదో బుధవారంలోగా తెలియజేయండి” అంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసు జారీ చేసింది. ”మీరు నియమావళిని ఉల్లంఘించారు. మీ సమాధానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాం. భవిష్యత్తులో నిబంధనల పట్ల జాగ్రత్తగా ఉండండి” అంటూ తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును హెచ్చరించింది. ఈ మేరకు మంగళవారం వారిద్దరికీ శ్రీముఖాలు పంపింది. ఇటీవల ఖానాపూర్‌ నియోజికవర్గంలో [...]

ఆ’పదె’వరికి..! (Eenadu, 28-5-08)

May 28, 2008

మూడు పార్టీల మధ్యా హోరాహోరీ
గెలుపుపై ఎవరి ధీమా వారిదే
ఎవరికైనా స్వల్ప ఆధిక్యమే!
హైదరాబాద్‌ – న్యూస్‌టుడే : తెర్లాం స్థానాన్ని పక్కనబెడితే రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరుగుతున్న మిగతా 17 శాసనసభ స్థానాల్లో ఉత్కంఠభరితమైన పోరు నెలకొంది. మూడు ప్రధాన పార్టీల నేతలు విస్తృతంగా పర్యటించారు. తెలంగాణ ప్రత్యేక భావనే ప్రధానాస్త్రంగా తెరాస, అభివృద్ధే ఆయుధంగా కాంగ్రెస్‌, ఈ రెండు పార్టీలు ప్రజలకు ద్రోహం చేశాయని తెలుగుదేశం.. ఉద్ధృతస్థాయిలో ప్రచారం చేశాయి.