టిఆర్ ఎస్ అభ్యర్ధికి గాయాలు
జఫర్‌గఢ్, మే 26 (ఆన్‌లైన్): వరంగల్ జిల్లా స్టేషన్ పెండ్యాల సమీపంలో సోమవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదం లో స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గుండె విజయరామారావు స్వల్పంగా గాయపడ్డారు.
Archive for May 27th, 2008
రోడ్డు ప్రమాదంలో (Andhrajyothy, 27-5-08)
May 27, 2008పాల్‌తో కేసీఆర్ రహస్య ఎజెండా ఏమిటి? (Andhrajyothy, 27-5-08)
May 27, 2008కెసి ఆర్ ఓట్ల దొంగ
కరీంనగర్, మే 26 (ఆన్‌లైన్): ‘మతప్రచారకుడైన కెఎపాల్‌కు తెలంగాణ ఎజెండాగా పని చేస్తున్న కెసిఆర్‌కు మధ్య జరిగిన రహస్య చర్చల సారాంశమేమిటో ప్రజలకు వివరించాలి. ఈ ఇద్దరి రహస్య ఎజెండా ఏమిటో, ఇద్దరు కలిసి చేసిన కుట్ర ఏమిటో వెల్లడించాలి’ అని పిసిసి అధికార ప్రతినిధి, మాజీ ఎంఎల్‌ఎ కటకం మృత్యుంజయం డిమాండ్ చేశారు.
కార్యదర్శుల కొరత అపారం: రోశయ్య (Andhrajyothy, 27-5-08)
May 27, 2008ఆర్థికశాఖలోని ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు సమన్వయంతో పనిచేస్తూ తనకు పూర్తి సహకారాన్ని అందిస్తున్నారని ఆ శాఖ మంత్రి కె.రోశయ్య పేర్కొన్నారు. సోమవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. అందరి సహకారం వల్లే నాలుగేళ్లలో ఏనాడూ ఓవర్ డ్రాఫ్ట్‌కు వెళ్లలేదని.. ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టగలిగామని చెప్పారు.
టీఆర్‌ఎస్‌కు బుడగ జంగం సమాఖ్య మద్దతు (Andhrajyothy, 27-5-08)
May 27, 2008హైదరాబాద్, మే 26 (ఆన్‌లైన్): అఖిల భారత బుడగ జంగం సంక్షేమ సమాఖ్య.. టీఆర్‌ఎస్ పార్టీకి తన మద్దతు ప్రకటించింది. ఉపఎన్నికల బరిలో నిలిచిన టీఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆ సమాఖ్య నిర్ణయించింది. హైదరాబాద్‌లో సోమవారం ఆ సమాఖ్య జాతీయ అధ్యక్షుడు డాక్టర్ చింతల యాదగిరి అధ్యక్షతన రాష్ట్రకమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సమాఖ్య రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు చింతల మల్లేశం, తూర్పాటి నర్సింహ్మా మాట్లాడుతూ.. బుడగజంగాల సంక్షేమం, అభివృద్ధి ప్రత్యేక తెలంగాణ [...]
రాష్ట్ర న్యాయకత్వం కాదన్నా తెలంగాణ ఇవ్వాలి (Andhrajyothy, 27-5-08)
May 27, 2008అధిష్ఠానానికి ఉప్పునూతల వినతి
హైదరాబాద్, మే 26 (ఆన్‌లైన్): తెలంగాణ ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని.. రాష్ట్ర నాయకత్వాన్ని కాదనైనా ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాల్సిందే.. అని తెలంగాణ ప్రాంతీయ ప్రణాళిక, అభివృద్ధి మండలి చైర్మన్ ఉప్పునూతల పురుషోత్తమరెడ్డి అధిష్ఠానానికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడారు.
మూతపడేది గాంధీభవనే (Andhrajyothy, 27-5-08)
May 27, 2008తెలంగాణ గుండె దరువుకు ఢిల్లీ కళ్లె తెరవాలి
కరీంనగర్, మే 26 (ఆన్‌లైన్): ్‌కర్ణాటకలో ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టారు. ఇక్కడ బొంద పెడితే ఢిల్లీ దిగి రాక తప్పదు. అందుకే కావాలని ఎన్నికలు తెచ్చాం. ఈ ఎన్నికల్లో తెలంగాణ గుండెదరువు ఢిల్లీకి తెలపాలి. తెలంగాణ పౌరుషాన్ని చాటాలి. జూన్ 1కి ఖాళీ అయ్యేది తెలంగాణ భవన్ కాదు. మూతపడేది గాంధీ భవన్* అని కెసిఆర్ అన్నారు.
TeNa Banner in Andhrajyothy paper 27-5-08
May 27, 2008తెలంగాణకు వైఎస్ అడ్డని, ప్రధాని నాతో అన్నారు. (Eenadu, 27-5-08)
May 27, 2008జయశంకర్ వెల్లడి
ఆసిఫాబాద్, న్యూస్‌టుడే: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వై.ఎస్ అడ్డం ఉన్నారని ప్రధాన మంత్రి మన్‌మోహన్‌సింగ్ నాతో కూడా అన్నారని తెరాస సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ సోమవారం ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ జరిగిన తెలంగాణ విద్యావంతుల వేదిక సదస్సులో పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణకు సీఎం అడ్డు అని ప్రధాన మంత్రితనకు చెప్పారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడె ఎం.సత్యనారాయణరావు ఇదివరకే బహిర్గతం చేశారని తెలిపారు. దీనికి సీనియర్ నేత జి.వెంకటస్వామి సాక్ష్యమని కూడా ఎంఎస్‌ఆర్ పేర్కొన్నారని [...]
సోనియా తెలంగాణ ఇస్తే అడ్డుకునేందుకు వైఎస్ ఎవరు? (Eenadu, 27-5-08)
May 27, 2008కేసీఆర్‌కు తొందరెక్కువ… ఇప్పుడే కావాలంటే ఎట్టా: వీహెచ్
జడ్చర్ల గ్రామీణం, న్యూస్‌టుడే: ‘తెలంగాణ ఏర్పాటుకు మేం కట్టుబడి ఉన్నాం. వంద శాతం చెబుతున్నా. సోనియా అడ్డుకోలేదు. ఈ అంశం యూపీఏ పరిశీలనలో ఉంది. సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వతలచుకుంటే అడ్డుకోవడానికి వైఎస్ ఎవరు’ అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు హనుమంతరావు అన్నారు.