Archive for May, 2008
ఉప ఎన్నికలను బహిష్కరించండి (Andhrajyothy, 29-5-08)
May 29, 2008మావోయిస్టుల పిలుపు
హైదరాబాద్, మే 28 (ఆన్‌లైన్): ఉప ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఈ మేరకు భారత కమ్యూనిస్టుపార్టీ (మావోయిస్టు) ఉత్తర తెలంగాణా స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి చంద్రన్న పేరుతో ఒక ప్రకటన బుధవారం ‘ఆంధ్రజ్యోతి’ కార్యాలయానికి అందింది.
మొత్తం సీట్లు గెలుస్తాం (Andhrajyothy, 29-5-08)
May 29, 2008విజయ దుంధుభి మోగిస్తం
మంత్రి పదవులు గడ్డిపోచలు
అది వై ఎస్ అహంకారానికి పరాకాష్ట
దిగిరాకుంటే ఢిల్లీ నేతలది మూర్ఖత్వమే కేసీ ఆర్
హైదరాబాద్, మే28 (ఆన్‌లైన్): ఉప ఎన్నికల ద్వారా తెలంగాణవాదం హిమాలయాలంత ఎత్తుకు ఎగుస్తుందని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. అపూర్వ రీతిలో తెలంగాణలోని మొత్తం నాలుగు లోక్‌సభ, 17 అసెంబ్లీ స్థానాలను భారీ మెజారిటీతో గెలుచుకుంటామని ఆయన జోస్యం చెప్పారు.
తెలంగాణ పోరుకు క్లైమాక్స్! నేడే పోలింగ్ సర్వం సిద్ధం
May 29, 2008పటిష్టమైన బందోబస్తు
ఐదు దాటినా ఓటేయొచ్చు!
ఎన్నికల విధుల్లో 45 వేల మంది
హైదరాబాద్, మే 28 (ఆన్‌లైన్): తెలంగాణ పోరు క్లైమాక్స్‌కు చేరింది. పార్టీల భాగ్యరేఖలను మార్చి రాష్ట్ర భవితవ్యానికి దిశానిర్దేశం చేస్తాయని భావిస్తున్న ఉప ఎన్నికల్లో అసలు ఘట్టానికి తెర లేచింది. నాలుగు లోక్‌సభ, 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు గురువారం పోలింగ్ జరగనుంది.
నేడే పోలింగ్ .. (Andhrajyothy, 29-5-08)
May 29, 2008తెలంగాణలో ‘సారా’ జ్యం
ఆదిలాబాద్‌లో ముందే కొనుగోళ్లు
పరకాలలో కాంగ్రెస్, టీ ఆర్ ఎస్ ల ఘర్షణ
నల్లగొండలో వర్గాల వారీగా వంపిణీ
దొమ్మాటలో భారీగా మద్యం పట్టివేత
వికారాబాద్‌లో టీ ఎన్ టీయూసీ రాష్ట్ర నేత అరెస్టు
ముషీరాబాద్‌లో చీరల పంపిణీ
(ఆన్‌లైన్ న్యూస్ నెట్‌వర్క్) ప్రజాస్వామ్యం అపహాస్యమైంది. మద్యం ఏరులై పారింది. పచ్చనోట్లు, ఎర్రనోట్లు జోరుగా చేతులు మారాయి. తెలంగాణ ఉప ఎన్నికల పోలింగ్‌కు కొన్ని గంటలే సమయం మిగిలి ఉండటంతో పార్టీలన్నీ దీన్ని ‘సద్వినియోగం’ చేసుకునేందుకు తొందరపడ్డాయి.
ఎంపీని కొట్టిన మంత్రి (Andhrajyothy, 29-5-08)
May 29, 2008ముఖేశ్ వియ్యంకుడి ఇంట్లో డబ్బు పంపిణీ
రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న సీపీ ఎం
అరెస్టు చేయాలంటూ బైఠాయింపు
ముఖేశ్, దానం, అంజన్ వీరంగం
ప్రతిపక్ష కార్యకర్తలపై దాడి
మధు, వీరయ్య సహా పలువురికి గాయాలు
రెచ్చిపోయిన ఇరు వర్గాలు
రాళ్లు, జెండా కర్రలతో దాడులు
పోలీసుల లాఠీ చార్జి
ఆంధ్రజ్యోతి ఎండీపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు (Eenadu,29-5-08)
May 29, 2008సంపాదకుడు, విలేఖరిపై కూడా
క్షమాపణ చెప్పేందుకు గడువిచ్చా
అయినా స్పందించనందుకే ఫిర్యాదు
మందకృష్ణ వెల్లడి
మద్దతిచ్చే జర్నలిస్టులపైనా కేసులు పెడతామని హెచ్చరిక
హైదరాబాద్ – న్యూస్‌టుడే: ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణ, సంపాదకుడు కె.శ్రీనివాస్, ‘బాడుగ నేతలు’ కథనం రాసిన విలేఖరిపై.. ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టం కింద కేసులు నమోదయ్యాయి.
ఎక్కడా వ్యతిరేకత లేదు (Eenadu, 29-5-08)
May 29, 2008అనుకూల ఓటుతో మాకే ఎక్కువ స్థానాలు
2 లోక్‌సభ, 9 అసెంబ్లీ సీట్లకుపైగా గెలుస్తాం
ఒక్క అంశంపైనే ఉప ఎన్నికలు జరగడం లేదు
తెదేపా, తెరాసలను ఎండగట్టాం
భాజపాకు చేరువవుతున్న బాబు: ముఖ్యమంత్రి
హైదరాబాద్ – న్యూస్‌టుడే : ఉప ఎన్నికల్లో ఎక్కడా ప్రభుత్వ వ్యతిరేకత కనిపించలేదని, అనుకూల ఓటుతో మెజారిటీ స్థానాలు సాధిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ ధీమా వ్యక్తంచేశారు. 9 అసెంబ్లీ స్థానాలు, రెంటికి పైగా లోక్‌సభ స్థానాల్లో గెలుస్తామని చెప్పారు. తెలుగుదేశానికి తక్కువ ఓట్లు వస్తాయన్నారు.
ఓటుకింత! (Eenadu, 29-5-08)
May 29, 2008ఓటరును మద్యం మత్తులో ముంచుతున్న పార్టీలు
యథేచ్ఛగా డబ్బు, టీవీలు, క్రికెట్ కిట్ల పంపిణీ
-జడ్చర్లలో ప్రధాన పార్టీ ఖర్చు రూ.పది కోట్లకుపైనే
హైదరాబాద్ – న్యూస్‌టుడే : ఉప ఎన్నికల్లో విజయం కోసం రాజకీయ పార్టీలు బరితెగించాయి. పోలింగ్‌కు కొన్ని గంటల ముందు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు పెద్దఎత్తున సొమ్ము, మద్యం ఎరగా చూపాయి. ఒక ప్రధాన పార్టీ అయితే ఈ విషయంలో తనకెవరూ సాటిరారని నిరూపించుకునేలా విచ్చలవిడిగా నోట్లవర్షం కురిపించింది.
‘ఉప’తీర్పు నేడే (Eenadu, 29-5-08)
May 29, 2008పార్టీల ‘కిక్కు’లకు
పచ్చనోట్ల పంచ్‌లకు
ప్రభువుల ముష్టిఘాతాలకు
దిమ్మదిరిగిన ఓటుహక్కు
ప్రజాభీష్టం చాటేందుకు
పళ్లబిగువున బయలుదేరింది
దండనెవరికో… దండలెవరికో!!
హైదరాబాద్, న్యూస్‌టుడే: ప్రతిష్ఠాత్మకంగా సాగుతున్న ఉప ఎన్నికల్లో ప్రజలు ఈ రోజు తీర్పు ఇవ్వనున్నారు. విజయనగరం జిల్లాలోని తెర్లాంతో పాటు తెలంగాణలోని 17 శాసనసభ, నాలుగు లోక్‌సభ నియోజకవర్గాల్లో గురువారం ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది. సాయంత్రం ఐదుదాకా కొనసాగుతుంది. సజావుగా పోలింగ్ జరగడానికి 63 వేల మందికిపైగా పోలీసులను రంగంలోకి దించారు.