June 3, 2008
The Telangana Rashtra Samithi (TRS) might blame people of Telangana by saying that people could not understand their strategy. Andhraites may feel happy at the by-election results. But what went wrong for the TRS?
Read more »
Posted in Deccan Post, news Papers |
June 3, 2008
TRS MLA T Harish Rao meeting chief minister Y S Rajasekhara Reddy a day after the by-election results surprised many. It is a topic of discussion among the general public and several are at dismay over the incident.
Posted in Deccan Post, news Papers |
June 3, 2008
హైదరాబాద్, జూన్ 3 : కె. సి.ఆర్. అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.
తమ రాజీనామాను ఆమోదించాలని ఆయన టి.ఆర్.ఎస్. కార్యవర్గాన్ని కోరినట్టు తెలుస్తున్నది.
ఉపఎన్నికల ఫలితాలతో హవా పెరుగుతుందనుకుంటే, అసలుకే మోసం రావడంతో మనస్తాపం చెందిన కె.సి.ఆర్.
ఎట్టి పరిస్థితులలోనూ వెనకడుగు వేసేది లేదని సన్నిహితులకు తేల్చి చెప్పినట్టు తెలుస్తున్నది.
Posted in Andhrajyothy, news Papers |
June 3, 2008
హైదరాబాద్, జూన్ 3 : ఉప ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేని తెరాస అధ్యక్షుడు కేసీఆర్ రాజీనామా చేస్తున్నట్లు ఫలితాలు వెలువడిన రోజే కలకలం రేగింది. అయితే ఆరోజు నేతలు వారించటం, అలాంటి పరిణామం ఏదీ జరగకపోవటంతో అదేం లేదనే భావించారు. అయితే ఈరోజు తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్ష పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు.
Posted in Eenadu, news Papers |
June 3, 2008
కాంగ్రెస్‌పై మా పోరాటం చాలలేదు: దేవేందర్
హైదరాబాద్, జూన్ 2 (ఆన్‌లైన్): కాంగ్రెస్ తప్పిదాలు, వైఫల్యాలపై తాము చేస్తున్న పోరాటం చాలలేదని, అందుకే ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి కొన్ని సీట్లు లభించాయని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు దేవేందర్ గౌడ్ ‘ఆన్‌లైన్’తో అన్నారు. “కాంగ్రెస్ ఈ ప్రాంతానికి ఇంత ద్రోహం చేసి… లేని అభివృద్ధిని ప్రచారం చేసుకున్నా ఈ మాత్రం స్ధానాలు వచ్చాయి. వాస్తవానికి ఇవి కూడా రాకూడదు.
Posted in Andhrajyothy, news Papers |
June 3, 2008
హైదరాబాద్, జూన్ 2 (ఆన్‌లైన్): ఉప ఎన్నికల్లో పార్టీ అనూహ్యంగా ఓటమిపాలు కావడంతో తీవ్ర ఒత్తిడికి గురైన టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు రెండో రోజు కూడా ఇంట్లో నుంచి బయటికి రాలేదు. పార్టీ ముఖ్య నేతలను, అభ్యర్థులను, కొందరు ప్రముఖులను తప్ప మరెవరినీ కలుసుకోలేదు. ఉప ఎన్నికల్లో గెలిచిన ఈటెల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు, డాక్టర్ నగేశ్, రామలింగారెడ్డి, టి.హరీశ్‌రావు తదితరులు ఆయన్ని కలిసి చాలాసేపు మాట్లాడారు. తెలంగాణ విద్యావంతులు ప్రొఫెసర్ జయశంకర్, ప్రొఫెసర్ కోదండరామిరెడ్డి, నందినీ సిద్ధారెడ్డి, దేశపతి శ్రీనివాస్‌లు సైతం ఆయనను కలిసి సుదీర్ఘంగా మంతనాలు జరిపారు.
Read more »
Posted in Andhrajyothy, news Papers |
June 3, 2008
హైదరాబాద్, జూన్ 2 (ఆన్‌లైన్): తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు విషయమై ముఖ్యమంత్రి మరోసారి సానుకూల సంకేతాలు పంపారు. ఒక ప్రైవేటు చానల్ నిర్వహించిన కార్యక్రమంలో సోమవారం ఆయన పాల్గొన్నారు. టీఆర్‌ఎస్‌తో పొత్తు మళ్లీ ఉంటుందా అని ప్రశ్నించగా ‘నో’ అని మాత్రం చెప్పలేనని ఆయన స్పష్టం చేశారు. ఇదే ప్రశ్న బీజేపీ గురించి.. తెలుగుదేశం గురించి అడిగితే నో అని వెంటనే చెప్పగలను.. కానీ టీఆర్‌ఎస్ విషయంలో అలా కాదు.
Posted in Andhrajyothy, news Papers |
June 3, 2008
హైదరాబాద్, జూన్ 3 : కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రామన్నపేట ఎమ్మెల్యే ఉప్పునూతల పురుషోత్తంరెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించాలని కాంగ్రెస్ నాయకుడు లాజరస్ డిమాండ్ చేశారు. ఆయనకు మద్దతు తెలుపుతున్న ఐటి శాఖ మంత్రి దామోదర్‌రెడ్డి కూడా మద్దతు తెలిపారు. మంగళవారం ఉదయం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ తక్షణమే ఉప్నునూతలను పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు.
Posted in Andhrajyothy, news Papers |
June 3, 2008
మేడారం ఓటమిపై వైఎస్ వర్గీయులు గరంగరం
అధిష్ఠానానికి ఫిర్యాదుచేసేందుకు సమాయత్తం
కరీంనగర్, న్యూస్‌టుడే: కాంగ్రెస్ విధాన నిర్ణాయక కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో తెలంగానం ఆలపించి కలకలం సృష్టించిన సీనియర్ నేత జి.వెంకటస్వామిని ఇరుకునపెట్టేందుకు వైఎస్ వర్గీయులు రంగం సిద్ధం చేశారు. కరీంనగర్ జిల్లా మేడారంలో కాంగ్రెస్ అభ్యర్థి కుమారస్వామి ఓటమికి ఆయన వైఖరే కారణమన్న ఆరోపణతో అధిష్ఠానానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. నిజానికి మేడారం (ఎస్సీ) స్థానం కాకా ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది.
Posted in Eenadu, news Papers |
June 3, 2008
ఆలేరు కాంగ్రెస్ అభ్యర్థి లాజరస్ డిమాండ్
గాంధీభవన్‌లో నిరాహారదీక్ష; అరెస్టు
సీనియర్లకు సెగ: ఉప ఎన్నికల్లో అనూహ్య ఫలితాలతో ఉబ్బితబ్బిబ్బవుతున్న ముఖ్యమంత్రి వైఎస్ వర్గీయులు.. ఇప్పుడు స్వపక్షంలోని వ్యతిరేకులపై దృష్టి సారించారు. కొన్ని చోట్ల పార్టీ అభ్యర్థుల ఓటమికి కారకుంలంటూ కొందరు సీనియర్లను ఇరుకునపెట్టే వ్యూహాలకు శ్రీకారం చుట్టారు. నల్గొండ జిల్లా ఆలేరులో తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి మండలి అధ్యక్షుడు ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి లాజరస్ విజయానికి కృషిచేయలేదని, ఆయన్ను పార్టీ నుంచి సాగనంపాలని రాష్ట్ర మంత్రి దామోదరరెడ్డి డిమాండ్ చేయగా.. లాజరస్ సోమవారం గాంధీభవన్‌కు వచ్చి ఏకంగా నిరాహారదీక్షకే కూర్చున్నారు. అలాగే అగ్రనేత వెంకటస్వామి కరీంనగర్ జిల్లా మేడారం స్థానంలో బలమైన అభ్యర్థిని నిలబెట్టకుండా తన కుమారుడి కోసం డమ్మీ అభ్యర్థిని బరిలోకి దించి ఓడిపోయేలా చేశారని వైఎస్ వర్గీయులు ఆరోపిస్తున్నారు. అధిష్ఠానానికి ఫిర్యాదు చేసేందుకు ఓ రాష్ట్ర మంత్రి నేతృత్వంలో ఢిల్లీ బయల్దేరనున్నారు.
Read more »
Posted in Eenadu, news Papers |